Wednesday, July 15, 2015

ఫేస్ బుక్ కొత్త Virtual అసిస్టంట్


ఫేస్ బుక్ కొత్త Virtual అసిస్టంట్

Virtual వాయిస్ అసిస్టంట్ కాదు, నిజమైన మనుషులు ఉంటారు దీనిలో.

15 - Jul - 2015English లో చదవండి
ఫేస్ బుక్ కొత్త Virtual అసిస్టంట్
ఫేస్ బుక్ ఇప్పటి వరకూ చాలా కొత్త అప్ డెట్లు లాంచ్ చేసింది. మెసెంజర్ యాప్ కు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి యూజర్స్ ను ఆకట్టుకొనే ప్రయత్నాలలో HD వీడియో కాలింగ్, కాష్ ట్రాన్సఫర్స్ మరియు ఫేస్ బుక్ అకౌంట్ లేని వాళ్లు సైతం మెసెంజర్ వాడుకునే సదుపాయం లాంటి ఫీచర్స్ ను అనౌన్స్ చేసింది.

ఇప్పుడు మళ్ళీ "Real Life" Virtual అసిస్టంట్ పై పని చేస్తుంది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది ఫేస్ బుక్ మెసెంజర్ లో పని చేసే ఫీచర్. ఆండ్రాయిడ్ లోని గూగల్ Now, ఆపిల్ సిరి లకు పోటిగా ఉండనుంది. దీని పేరు MoneyPenny అని అంటున్నారు. ఇది రీసర్చ్ మరియు ప్రొడక్ట్ సర్విసస్ ను ఆర్డర్స్ చేయటానికి ఉపయోగించగలరు. దీనిలో వాయిస్ అసిస్టంట్ కాకుండా నిజమైన మనుషులు మాట్లాడతారని రిపోర్ట్స్.

ఎప్పుడూ రిలీజ్ అవనుంది, ఏ రీజియన్ లలో రిలీజ్ అవుతుంది అనే దానిపై ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లో ప్రత్యేకంగా చెప్పుకుంటున్న Cortana కు కూడా గట్టి పోటీ ఇస్తుంది.

No comments:

Post a Comment