Saturday, August 1, 2015

monitor స్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ లో బాగా ఉపయోగపడుతుంది.

monitor

స్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ లో బాగా ఉపయోగపడుతుంది.
మీకు తెలియని యాప్: Network monitor
3g నుండి 4g వచ్చింది కాని మన దేశంలో ఇంటర్నెట్ ఇంకా 2G సర్వీసే ఎక్కువగా వాడుతున్నారు. కారణం మొబైల్ నెట్వర్క్స్ కంపెనీల అధిక రేట్ల ప్లాన్స్. అయితే మీరు ఇంటర్నెట్ కు సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు చాలా సార్లు నెట్ పనిచేస్తుందా లేదా అనే టట్లు గా ఉంటుంది స్పీడ్.
ఇది ముఖ్యంగా అన్ లైన్ transactions అప్పుడు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు Network monitor మిని యాప్ బాగా పనిచేస్తుంది. ఇది మీరు నెట్ వాడుతున్నప్పుడు లైవ్ స్పీడ్ ను డిస్ప్లే పై చూపిస్తుంది. లైవ్ ఇంటర్నెట్ స్పీడ్ చూపించే కాన్సెప్ట్ మీకు తెలిసినది అయి ఉండచు కాని ఈ యాప్ మరియు దీనిలోని ఫీచర్స్ తెలియకపోవటానికి చాన్సేస్ ఎక్కువ.


 
దీనిలో మంచి ఫీచర్స్ -

1. స్క్రీన్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు లైవ్ రీడింగ్ ను.
2. download or upload స్పీడ్ లేదా రెండూ ఒకేసారి నచ్చిన విధంగా కనపడేలా సెట్ చేసుకోగలరు.
3. నెట్ లేని సమయంలో డిస్ప్లే పై లైవ్ రీడింగ్ "0" అని కూడా చూపించకుండా Auto hide ఆప్షన్ ద్వారా అసలు పూర్తిగా కనపడకుండా పెట్టుకోగలరు. (అయితే ఇది pro వెర్షన్ లోనే ఉంది)
4. కలర్స్, allignments, transparency, డిస్ప్లే text సైజ్ customizations.
5. per second వంటివి కనిపించకుండా చేసుకోవటానికి hide suffix ఆప్షన్ ఉంది.
6. సైజ్ మార్చుకోవటానికి ఫ్రీ ఆప్షన్ ఉండటం వలన దీనిని చాలా చిన్నదిగా పెట్టుకొని ఎవ్వరికీ కనపడకుండా మనకు కూడా డిస్ప్లే పై అడ్డుగా లేకుండా సెట్ చేసుకొని డార్క్ కలర్ (రెడ్) సెట్ చేసుకుంటే ఇక లైవ్ గా internet స్పీడ్ (traffic) డిస్ప్లే అవుతుంది కాబట్టి మీకు నెట్ ఆగిపోయిందా ఇంకా రన్ అవుతుందా అనే సందేహం తో ఇబ్బందులు రావు.

Network monitor mini యాప్ ను ప్లే స్టోర్ నుండి ఈ లింక్ లో డౌన్లోడ్ చేసుకోగలరు. దీనికి ప్రో వెర్షన్ కూడా ఉంది.

No comments:

Post a Comment